ఏప్రిల్ యూరియా కోటా భర్తీ చేయండి
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:28 AM
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని... అందులో 69 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందిందని..
బకాయి ఉన్న 1.33 లక్షల టన్నులు సరఫరా చేయాలి
కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని... అందులో 69 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందిందని.. మిగిలిన 1.31 లక్షల మెట్రిక్ టన్నులను తక్షణమే పంపించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఏప్రిల్ నెల కోటా 2 లక్షల మెట్రిక్ టన్నుల్లో 1.33 లక్షల టన్నులు దేశీయ ఉత్పత్తి యూరియా, 67 వేల టన్నులు విదేశీ దిగుమతి యూరియాను కేటాయించినట్లు తుమ్మల వెల్లడించారు. కాగా ఇంపోర్టెడ్ యూరియా ఒక్క బస్తా కూడా రాలేదన్నారు. ఏప్రిల్ కోటా భర్తీ కాకపోవటం ఆందోళన కలిగిస్తోందని మంత్రి తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి 95 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కోరారు.