3.5లక్షల టన్నుల యూరియా సిద్ధంగా ఉండాలి
ABN , Publish Date - May 12 , 2026 | 04:28 AM
జూన్ మొదటి వారంలో ఖరీఫ్ సీజన్ వరి నాట్లు ప్రారంభమయ్యే అవకాశమున్నందున.. ఈ నెలాఖరుకే 3.50లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ...
అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): జూన్ మొదటి వారంలో ఖరీఫ్ సీజన్ వరి నాట్లు ప్రారంభమయ్యే అవకాశమున్నందున.. ఈ నెలాఖరుకే 3.50లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌కు 11.50లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్రాన్ని కోరగా.. 10లక్షల టన్నులనే కేటాయించిందన్నారు. ఏప్రిల్, మే నెలల్లో 4లక్షల టన్నులు రావాల్సి ఉండగా.. 2లక్షల టన్నులు మాత్రమే అందిందని గుర్తు చేశారు. కోటా ప్రకారం మిగతా యూరియా రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో90శాతం తెలంగాణకే కేటాయించాలని కోరుతూ కర్మాగారం ఎండీకి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. ఎరువుల పంపిణీ కోసం కేంద్రం కూడా సరికొత్త యాప్‌ను తీసుకురానుందని, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.