సకాలంలో టీబీని గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదు
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:39 AM
క్షయవ్యాధిని నిర్థారించే ఆధునిక డయాగ్నోస్టిక్ కిట్ల తయారీలో తెలంగాణ తాజాగా ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం సాధించిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
నిర్ధారణ కిట్లను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధిని నిర్థారించే ఆధునిక డయాగ్నోస్టిక్ కిట్ల తయారీలో తెలంగాణ తాజాగా ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం సాధించిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రాణాంతక క్షయవ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా రోగులను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం ఆయన శాసనసభ కమిటీ హాల్‌లో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో తయారైన డ్రగ్ రెసిస్టెంట్ క్షయ వ్యాధి కిట్లను ఆవిష్కరించారు. ఫ్రెంచ్ డయాగ్నోస్టిక్ దిగ్గజం బయోమెరియో వీటి ఉత్పత్తిని ప్రారంభించింది. జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటు కోసం బయోమెరియో తొలి దశలో రూ.50 కోట్లు వ్యయం చేసింది. ఇందులో 100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. త్వరలో ఇక్కడ పరిశోధన, అభివృద్థి లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది.