Share News

అక్రమ వసూళ్లు చేస్తే డీలర్‌ లైసెన్స్‌ రద్దు చేస్తాం

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:03 AM

షోరూమ్‌లలో వాహనాల రిస్ట్రేషన్‌ పేరుతో అక్రమంగా హ్యాండ్లింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ పేర్కొంది.

అక్రమ వసూళ్లు చేస్తే డీలర్‌ లైసెన్స్‌ రద్దు చేస్తాం

  • రవాణా శాఖ హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): షోరూమ్‌లలో వాహనాల రిస్ట్రేషన్‌ పేరుతో అక్రమంగా హ్యాండ్లింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ పేర్కొంది. ‘షోరూమ్‌ల్లో ఏజెంట్‌ పేరిట వసూళ్లు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ, హ్యాండ్లింగ్‌ చార్జీలు వసూలు చేస్తే డీలర్‌ అథరైజేషన్‌ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. జనవరి 24 నుంచి షోరూమ్‌ల వద్ద రిజిస్ట్రేషన్‌ చేసే విధానం అమలులో ఉన్నా, నిబంధనలు ఉల్లంఘిస్తూ కొనుగోలుదారులను డీలర్లు మోసం చేస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో రవాణా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - Mar 11 , 2026 | 05:03 AM