Share News

ధాన్యం రవాణాకు వాహనాల కొరత లేకుండా చూడండి

ABN , Publish Date - May 08 , 2026 | 07:04 AM

ధాన్యం తరలింపుపై రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యం రవాణాకు వాహనాల కొరత లేకుండా చూడండి

  • జిల్లా రవాణాశాఖ అధికారులకు కమిషనర్‌ ఆదేశం

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): ధాన్యం తరలింపుపై రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, మిల్లులకు వేగంగా తరలించేందుకు వాహనాల కొరత లేకుండా చూడాలని, అవసరమైన వాహనాలను సమీకరించాలని సూచించారు. సరుకు రవాణాకు సరిపడా వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం రవాణా చేసే అన్ని వాహనాలకు సరైన పత్రాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. ఆర్సీ, ఫిట్‌నెస్‌, పర్మిట్‌, ఇన్సురెన్స్‌. పొల్యూషన్‌ సహా ఇతర చెల్లుబాటు పత్రాలతో పాటు డ్రైవర్లకు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు.

Updated Date - May 08 , 2026 | 07:04 AM