Share News

ఆర్టిజన్లపై టెర్మినేషన్‌ కత్తి!

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:23 AM

డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై విద్యుత్‌ సంస్థలు కొరడా ఝలిపించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆర్టిజన్లపై టెర్మినేషన్‌ కత్తి!

  • గురువారం ఉదయం 11లోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని ట్రాన్స్‌కో ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై విద్యుత్‌ సంస్థలు కొరడా ఝలిపించేందుకు సిద్ధమవుతున్నాయి. గురువారం (ఈనెల 16వ తేదీ) ఉదయం 11 గంటలలోపు విధుల్లో చేరకపోతే (డీమ్డ్‌ టూ టెర్మినేషన్‌) ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా పరిగణనలోకి తీసుకుంటామని ట్రాన్స్‌కో బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కమ్‌లు కూడా సమ్మెలో ఉన్న ఆర్టిజన్లు 24 గంటల్లోగా విధుల్లో చేరాలని నోటీసులు జారీ చేశాయి. పాల్వంచ కేటీపీఎ్‌సలో సమ్మెలో ఉన్న 51 మంది ఆర్టిజన్లను గురువారం విధుల్లో నుంచి తొలగించే ఉత్తర్వులు ఇస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. విద్యుత్‌ సంస్థల్లో ఆర్నెళ్ల పాటు సమ్మెలపై నిషేధం అమలులో ఉన్నందున... విధులకు హాజరు కాకపోతే ఆర్టిజన్లను తొలగిస్తామని విద్యుత్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Updated Date - Apr 16 , 2026 | 04:23 AM