Share News

30 వేల మందికి ‘భూసార వలంటీర్లు’గా శిక్షణ

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:16 AM

రాష్ట్రంలో భూసార పరీక్షలను ప్రోత్సహించి, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టిందని వ్యవసాయ ...

30 వేల మందికి ‘భూసార వలంటీర్లు’గా శిక్షణ

  • ‘రైతునేస్తం’లో మంత్రి తుమ్మల వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూసార పరీక్షలను ప్రోత్సహించి, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది యువ రైతులను ఎంపిక చేసి, వారికి ‘భూసార వలంటీర్లు’గా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. భూసార పరీక్షల అనంతరం రైతులకు అందించే భూ ఆరోగ్య కార్డులలోని వివరాలను సామాన్య రైతులకు అర్థమయ్యేలా వివరించడమే ఈ వలంటీర్ల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. కాగా, హుజూరాబాద్‌ మునిసిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లతో పాటు పలువురు సర్పంచ్‌లు మంత్రి తుమ్మలను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌లో ప్రతిపాదించిన డంపింగ్‌ యార్డ్‌ పనులను నిలిపివేయాలని వారు మంత్రిని కోరారు.

Updated Date - Apr 08 , 2026 | 06:16 AM