అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:59 AM
అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరాతండాకు చెందిన రైతు జాదవ్ సురేశ్‌నాయక్ ...
మామిడి పూత రాలిపోవడంతో మరొకరు
కంగ్టి, చెన్నూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరాతండాకు చెందిన రైతు జాదవ్ సురేశ్‌నాయక్ (53) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి అవసరాల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో అప్పుల భారం పెరిగి తీవ్ర మనస్తాపానికి గురైన సురేశ్, ఈనెల 19న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మామిడి చెట్లకు వచ్చిన పూత రాలిపోవడంతో మనస్తాపానికి గురై మంచిర్యాల జిల్లా కొత్తగూడెం రైతు ఎల్లబోయిన మల్లేష్(47) ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నూరు శివారులోని బుద్దారం రహదారిలో 5ఎకరాల్లో మామిడి తోటను సాగుకు రూ.2లక్షలు ఖర్చు చేశాడు. ఇటీవల మామిడి చెట్లకు పూత వచ్చి రాలిపోవడంతో దిగుబడిపై ఆందోళనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.