Share News

Life Sciences Policy: దావోస్‌ వేదికగా తెలంగాణ రైజింగ్‌

ABN , Publish Date - Jan 14 , 2026 | 07:16 AM

సంక్రాంతి ముందే గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. తెల్లవారడమే ఆలస్యం కోడి పందేలు మొదలుపెట్టేందుకు బరులు సిద్ధమయ్యా యి. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందెంకోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి.

Life Sciences Policy: దావోస్‌ వేదికగా తెలంగాణ రైజింగ్‌

  • 20న ప్రత్యేక కార్యక్రమంలో కొత్త లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ, ఏఐ హబ్‌ ఆవిష్కరణ

  • ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో భేటీకానున్న సీఎం రేవంత్‌

  • దావోస్‌ నుంచి అమెరికాకు ముఖ్యమంత్రి

  • అక్కడ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ

  • ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్‌కు సీఎం

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎ్‌ఫ-2026)గా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనాను విశ్వవ్యాప్తం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సన్నద్ధమైంది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే సదస్సులో భాగంగా తెలంగాణ రైజింగ్‌ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొత్త లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ, తెలంగాణ ఏఐ హబ్‌ను జనవరి 20న ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సీఈవోలు), అంతర్జాతీయ ప్రతినిధులకు తెలంగాణ రైజింగ్‌ దార్శనికతను సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా వివరించనున్నారు. గత డిసెంబరులో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికగా భారీ స్థాయిలో రాష్ట్రం పెట్టుబడులు ఆకర్షించిన నేపథ్యంలో వాటికి అనుగుణంగా వచ్చే రెండు దశాబ్దాల అభివృద్ధి ప్రణాళికలను దావోస్‌ వేదికగా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఐటీ, లైఫ్‌సైన్సెస్‌, పునరుత్పాదక ఇంధనం, తయారీ రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని సీఎం రేవంత్‌ వివరించనున్నారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రైపోర్ట్‌, బుల్లెట్‌ ట్రైన్‌, హైదరాబాద్‌కు వరుస కడుతున్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) గురించి ప్రపంచస్థాయి ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న జీఎ్‌సడీపీ వృద్ది, పారిశ్రామిక విధానాలు, బలమైన మౌలిక సదుపాయాల గురించి సమగ్రంగా వివరించాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ‘క్యూర్‌, ప్యూర్‌, రేర్‌’ నినాదంతో తెలంగాణను గ్లోబల్‌ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యంగా దావోస్‌ పర్యటన సాగనుంది.


13 రోజులు.. రెండు దేశాలు!

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 19న దావోస్‌కువెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. అమెరికా పర్యటనను ముగించుకుని ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌ చేరుకుంటారు. పెట్టుబడుల కోసం ఈనెల 19న హైదరాబాద్‌ను వీడనున్న సీఎం.. ఏకబిగిన 13 రోజుల్లో రెండు దేశాలను పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఆయన అమెరికా పర్యటనలో ఉంటారు.

16న నిర్మల్‌, 17న జడ్చర్లకు సీఎం

ఇదిలా ఉండగా.. ఈ నెల 16న ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌, 17న జడ్చర్లలో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 18న ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజున సీపీఐ ఆవిర్భవించి వందేళ్లయినసందర్భంగా ఖమ్మంలో ఆ పార్టీ నిర్వహించే సభలోనూ సీఎం పాల్గొననున్నారు. అక్కడి నుంచి మేడారం వెళ్లి మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. మర్నాడు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని దావోస్‌కు వెళ్తారు.

Updated Date - Jan 14 , 2026 | 07:23 AM