పూడికతీతతో చెరువుల పునరుద్ధరణ
ABN , Publish Date - May 03 , 2026 | 05:17 AM
రాష్ట్రవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరించడానికి పూడికతీత కార్యక్రమం చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ...
ఇందుకోసం ప్రత్యేక కమిటీలు వేయాలి: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరించడానికి పూడికతీత కార్యక్రమం చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జలసౌధలో తెలంగాణ రైతు, కూలీ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్లు తక్షణం చెరువుల పునరుద్ధరణ కోసం కమిటీలు వేయాలని, ఇందులో రైతులను సభ్యులుగా తీసుకోవాలని సూచించారు. వానాకాలంలో లోపు రెండునెలల్లో ఈ పనులు పూర్తి కావాలన్నారు. చెరువుల కింద ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు కట్టలు, కాల్వలకు సంబంధించి ఉన్న సమస్యల్ని గుర్తించాలని పేర్కొన్నారు. చెరువులకు నీటిని తరలించే కాల్వలకూ మరమ్మతు చేయాలని సూచించారు. పూడికతీతతో పాటు ఆయకట్టు రక్షణ, పూర్తిస్థాయి నీటి మట్టాన్ని (ఎఫ్‌టీఎల్) నిర్ధారించడం, అక్రమణలు ఉంటే తొలగించడం వంటి ప్రక్రియలు ఏకకాలంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖతో కలిసి చేపట్టాలని నిర్దేశించారు. చెరువులతో పాటు జూరాల, మూసీ ప్రాజెక్టులోనూ పూడికతీతను చేపట్టాలనిసూచించారు.