వంట గ్యాస్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - May 07 , 2026 | 05:18 AM
వంట గ్యాస్ డెలివరీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నెల రోజుల లోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన వెల్లడించారు.
కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్ డెలివరీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నెల రోజుల లోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన వెల్లడించారు. తెలంగాణ వంటగ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు బుధవారం సెక్రటేరియట్‌లో హరిచందనను కలిసి ఎల్‌పీజీ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సిలిండర్లు సరఫరా చేసే కార్మికులకు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో 806 గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని, వీరు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లకు కార్మిక శాఖ తరఫున నోటీసులు పంపిస్తామని, వారితో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కార్యదర్శి హరిచందన హామీ ఇచ్చారు.