50వేల ప్రభుత్వ సంస్థలకు టీ-ఫైబర్ ఇంటర్‌నెట్
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:17 AM
రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50వేల ప్రభుత్వ సంస్థలకు టీ-ఫైబర్ ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలనేది తమ ...
ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50వేల ప్రభుత్వ సంస్థలకు టీ-ఫైబర్ ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలనేది తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా వాడుతున్న ఇంటర్‌నెట్‌కు చేస్తున్న ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం టీ-ఫైబర్ నెట్‌ను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో 424 మండలాల్లోని 8,888 గ్రామపంచాయతీలకు, 4,800 ప్రభుత్వ సంస్థలకు టీ-ఫైబర్ అనుసంధానమైందని తెలిపారు.