Share News

ఉద్యాన పంటలకు ప్రోత్సాహం : తుమ్మల

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:18 AM

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ, ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఉద్యాన పంటలకు ప్రోత్సాహం :  తుమ్మల
TummalaNageshwarrao

  • కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి: తుమ్మల

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ, ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌, ఉద్యానశాఖ ఎండీ యాస్మిన్‌ బాషాతోపాటు ఉద్యానశాఖ, ఆయిల్‌ఫెడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండడం సానుకూల పరిణామమని అన్నారు. గతంతో పోలిస్తే సుగంధ ద్రవ్యాల సాగు 65ు, ఎర్రమిర్చి సాగు 83ు, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు 192ు, పూలసాగు 198ు పెరిగినట్లు తెలిపారు. వీటితోపాటు కూరగాయల సాగు విస్తీర్ణం కూడా పెరిగేలా చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని, ఆ దిశ గా ఉద్యానశాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు.

Updated Date - Oct 10 , 2026 | 06:18 AM