Share News

మోడల్‌ స్కూళ్లలో ఐఐటీ, నీట్‌, క్లాట్‌ కోచింగ్‌

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:18 AM

ఐఐటీ, జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ‘యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ పేరిట ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది.

మోడల్‌ స్కూళ్లలో ఐఐటీ, నీట్‌, క్లాట్‌ కోచింగ్‌
neet jee

హైదరాబాద్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఐఐటీ, జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ‘యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ పేరిట ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంపిక చేసిన 29 తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ గురువారం ప్రకటించింది. ఈ కేంద్రాల్లో 152 పని దినాల పాటు గంటల ప్రాతిపదికన పాఠాలు చెప్పేందుకు పార్ట్‌టైమ్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమిస్తారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం రూ.3.73 కోట్లు విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా 29 కేంద్రాల్లోని 3,920 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Updated Date - Oct 16 , 2026 | 06:18 AM