‘ప్రజా సూచన పోర్టల్’ ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:52 AM
రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న ‘జన్ సూచన పోర్టల్’ తరహాలో తెలంగాణలోనూ ‘ప్రజా సూచన పోర్టల్’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ఐటీ శాఖ అధికారులను ఆదేశించిన రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న ‘జన్ సూచన పోర్టల్’ తరహాలో తెలంగాణలోనూ ‘ప్రజా సూచన పోర్టల్’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందం గురువారం శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసింది. ఈ పోర్టల్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట అందుబాటులో ఉంచుతారు. ఐటీ శాఖ ద్వారా ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను నిఖిల్ డే ప్రశంసించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్లడంపై ఈ సందర్భంగా సమాలోచనలు జరిగాయి. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లును నిఖిల్ డే ప్రశంసించారు.