రోడ్డు ప్రమాదాల నివారణకు పీఎం రాహత్‌లో చేరుతాం
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:32 AM
రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం రాహత్ పథకంలో చేరేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్...
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం రాహత్ పథకంలో చేరేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రానికి తెలిపారు. పీఎం రహత్‌పై అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు, కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ నుండి మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, జేటీసీలు చంద్రశేఖర్, శివ లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం రహత్ పథకంలో చేరడానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో స్ర్కాప్ పాలసీ అమలు చేస్తున్నామని, ఈవీ పాలసీతో 100 టాక్స్ మినహాయింపు ఇచ్చినట్టు వివరించారు.