Share News

త్వరలో డిజిటల్‌ మీడియా పాలసీ

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:35 AM

జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో డిజిటల్‌ మీడియా పాలసీ తేనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై....

త్వరలో డిజిటల్‌ మీడియా పాలసీ

  • జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సానుకూల నిర్ణయం

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో డిజిటల్‌ మీడియా పాలసీ తేనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అర్హులైన జర్నలిస్టులందరికిఅక్రెడిటేషన్‌ కార్డులు జారీచేస్తామని చెప్పారు. అక్రెడిటేషన్లపై మొదట విడుదల చేసిన జీవోలో జర్నలిస్టు సంఘాల వినతి మేరకు మార్పులు చేశామని, అవసరమైతే మరోసారి మార్పులు చేసేందుకు సిద్ధమని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో రెండో విడత ఇళ్ల మంజూరు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మార్చి చివరి నాటికి సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. వివిధ దశల్లో ఆగిపోయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్థిదారులకు అందజేస్తామని తెలిపారు.

Updated Date - Mar 19 , 2026 | 04:35 AM