Share News

పోలీస్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి తెలంగాణ ఆతిథ్యం

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:20 AM

ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 5 వరకు హైదరాబాద్‌ వేదికగా 74వ బీఎన్‌ మల్లిక్‌ మెమోరియల్‌ అఖిల భారత పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి.

పోలీస్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి తెలంగాణ ఆతిథ్యం

  • హైదరాబాద్‌ వేదికగా జరిగే పోటీల్లో 46 జట్లు

హైదరాబాద్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 5 వరకు హైదరాబాద్‌ వేదికగా 74వ బీఎన్‌ మల్లిక్‌ మెమోరియల్‌ అఖిల భారత పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడా సంబరానికి తెలంగాణ పోలీస్‌ శాఖ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ బలగాల నుంచి క్రీడాకారులు తరలివస్తున్నారని, మొత్తం 46 జట్లు పాల్గొనబోతున్నాయన్నారు. 25న గచ్చిబౌలి ేస్టడియంలో ప్రారంభ వేడుకలు జరుగుతాయన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 05:20 AM