Share News

విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తాం

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:19 AM

రానున్న విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల సంఘాల ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తాం

  • సీఎం రేవంత్‌ సానుకూలంగా ఉన్నారు: మంత్రి పొన్నం

  • భవిష్యత్తు నేతలకు విద్యార్థి దశే పునాది: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రానున్న విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల సంఘాల ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాల నేతలను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళతానని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరతానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై గతంలో కూడా సీఎంతో మాట్లాడానని, ఆయన సానుకూలంగా ఉన్నారని చెప్పారు. గాంధీ భవన్‌లో గురువారం ఎన్‌ఎ్‌సయూఐ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకుంటే తనలాంటి మొదటి తరం రాజకీయాల్లోకి వచ్చి ఉండేదే కాదన్నారు. విద్యార్థి దశలో రాజకీయాలే భవిష్యత్తులో నాయకత్వానికి పునాది అని, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి పనిచేయాలని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ సూచించారు. ఎన్‌ఎ్‌సయూఐ నుంచి వచ్చిన వారే జాతీయ, రాష్ట్రస్థాయిలో ముఖ్య పదవుల్లో ఉన్నారన్నారు. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటంలో ఎన్‌ఎ్‌సయూఐ పాత్ర స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీధర్‌బాబు కొనియాడారు.

Updated Date - Apr 10 , 2026 | 05:19 AM