Share News

తెలంగాణకు మరో ‘అమృత్‌ భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:46 AM

తెలంగాణకు మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ను కేటాయిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేవలం స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌...

తెలంగాణకు మరో ‘అమృత్‌ భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ను కేటాయిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేవలం స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ (నాన్‌-ఏసీ) బోగీలతో ఉండే ఈ ఎక్స్‌ప్రెస్ను చర్లపల్లి నుంచి నాగర్‌కోయిల్‌కు నడపనున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను ఈ రైలు కనెక్ట్‌ చేయనుంది. దూర ప్రాంతాలకు వెళ్లే పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్‌ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు దక్షిణ మధ్యరైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 03:46 AM