కొత్తగా 10 బీఎస్సీ నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
ABN , Publish Date - May 28 , 2026 | 03:31 AM
తెలంగాణలో నర్సింగ్ విద్యావస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి ...
ఒక పీజీ కాలేజీ కూడా: మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నర్సింగ్ విద్యావస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ బలోపేతంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లారు. రాష్ట్రంలో కొత్తగా పది బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు, అలాగే ఒక పీజీ(ఎమ్మెస్సీ) నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే జీఎన్‌ఎంపూర్తి చేసిన విద్యార్థులకు తమ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వీలుగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు తగిన అనుమతులు ఇవ్వాలన్నారు. ప్రసవ సమయంలో కీలక పాత్ర పోషించే మిడ్ వైఫరీ కోర్సులను మరింత బలోపేతం చేేసలా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. కౌన్సిల్ పరిపాలనను మరింత క్రమబద్ధీకరించడానికి వీలుగా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌కు అధికారికంగా ‘రిజిస్ట్రార్’ పోస్టును క్రియేట్ చేయాలని అధికారులకు సూచించారు.