తుమ్మిడిహెట్టిపై శాస్ర్తీయ నివేదికలు సిద్ధం చేయండి
ABN , Publish Date - May 02 , 2026 | 05:07 AM
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు వీలుగా మహారాష్ట్ర సర్కారుతో చర్చలకు సన్నద్ధం కావాలని నీటిపారుదల శాఖ మంత్రి..
మహారాష్ట్రతో సంప్రదింపులకు సన్నద్ధమవండి
నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు వీలుగా మహారాష్ట్ర సర్కారుతో చర్చలకు సన్నద్ధం కావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతర్రాష్ట్ర అధికారుల సమావేశానికి ముందుగానే... ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలన్నారు. మహారాష్ట్రలో సాధ్యమైనంత మేర ముంపు తగ్గించేలా... గ్రావిటీతో నీటిని అందించేలా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఆయన ఈమేరకు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే ఆ ఎత్తుతో కట్టడం వల్ల గ్రావిటీతో జలాల తరలింపు అసాధ్యమన్నారు. ఈ నేపథ్యంలో.. దీనిని 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని చాప్రాల వన్యప్రాణుల అభయారణ్యంపై ప్రభావం పడుతుందా...? ముంపు ఏ స్థాయిలో ఉంటుంది..? వంటి అంశాలపై శాస్త్రీయ వివరాలను అందుబాటులో ఉంచుకునే ఆ రాష్ట్ర యంత్రాంగంతో సంప్రదింపులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహితపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి... గ్రావిటీతో ఆదిలాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్లదాకా నీటి తరలింపునకు నాటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే... ప్రాజెక్టుల రీ డిజైన్‌లో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆక్షేపించారు. రీడిజైన్‌తో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కడితే అవి విఫలమయ్యాయని అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి సాగునీటిని తరలించడానికి వీలుగా 71.5 కి.మీ. మేర ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయిందన్నారు. కాగా సాగునీటి తరలింపునకు నాలుగు అలైన్‌మెంట్లను ప్రతిపాదించారని, వీటిలో భూేసకరణను, పంపింగ్ అవసరాలను తగ్గ్గించడం, సొరంగం, కాలువ పొడవును కుదించడం వంటి అంశాల ఆధారంగా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పున రుద్ధరణ పనులను సైతం చేపడతామన్నారు. ఈ సమావేశంలో టన్నెలింగ్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఈఎన్‌సీ(జనరల్) రమే్‌షబాబు, ఈఎన్‌సీ(అడ్మిన్) టి.శ్రీనివాస్, ఈఎన్‌సీ(ఓ అండ్ ఎం) మధుసూదన్‌రావు, సీఈ సీడీవో ఎం.సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు.