అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకం: జూపల్లి
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:41 AM
తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పర్యాటక...
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తొలి దశలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను (మొత్తం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు) ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులు మన రాష్ట్రానికి వస్తే వారికి మరపురాని అనుభూతి, జ్ఞాపకంగా మిగిలిపోయేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. ప్రకృతి, వారసత్వం, ఆధ్యాత్మికత, సాహస క్రీడల కలబోతతో కూడిన ‘స్లో టూరిజం’ను ప్రోత్సహించాలని సూచించారు. మొదటి దశలో భాగంగా వికారాబాద్, సోమశిల-ఆలంపూర్, వరంగల్-రామప్ప, నాగార్జునసాగర్, యాదాద్రి-పోచంపల్లి, ఆదిలాబాద్ గిరిజన క్లస్టర్, భద్రాచలం, కాళేశ్వరం ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూ దేశంలోనే అత్యుత్తమ హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా భువనగిరిని అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.