Share News

ఎత్తయిన చోట్ల, జలవనరుల వద్ద క్యాంటీ లివర్‌ వ్యూ పాయింట్లు!

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:47 AM

ఎత్తైన ప్రాంతాల్లో, జల వనరుల వద్ద రష్యా, చైనా వంటి దేశాల్లో ఉన్న క్యాంటీ లివర్‌ వ్యూ పాయింట్స్‌ (గ్లాస్‌ స్ట్రక్చర్స్‌) ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని...

ఎత్తయిన చోట్ల, జలవనరుల వద్ద క్యాంటీ లివర్‌ వ్యూ పాయింట్లు!

  • రష్యా, చైనా తరహాలో ఏర్పాటుకు పరిశీలన

  • రామప్ప ఆలయం సమీపంలో అదనపు కాటేజీలు

  • 6 ప్రత్యేక పర్యాటక విభాగాల కోసం మాస్టర్‌ ప్లాన్‌: జూపల్లి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఎత్తైన ప్రాంతాల్లో, జల వనరుల వద్ద రష్యా, చైనా వంటి దేశాల్లో ఉన్న క్యాంటీ లివర్‌ వ్యూ పాయింట్స్‌ (గ్లాస్‌ స్ట్రక్చర్స్‌) ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. రామప్ప ఆలయ సమీపంలోని అనువైన ప్రాంతంలో అదనపు కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అవసరమైన చోట్ల సంప్రదాయ బోట్ల స్థానంలో అధునాతన బోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, సోమశిలలో అదనపు బోటును కూడా అందుబాలోకి తీసుకురావాలని సూచించారు. పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కార్యాలయంలో మంత్రి జూపల్లి.. పర్యాటకశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఇప్పటికే చేపట్టిన, ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Apr 21 , 2026 | 03:47 AM