Share News

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:18 AM

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-జూన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 15 నుంచి 30 వరకు ప్రతి రోజు...

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-జూన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 15 నుంచి 30 వరకు ప్రతి రోజు రెండు విడతల్లో (ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు) పరీక్షలు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ సోమవారం తెలిపారు. జూలై నెలాఖరులో ఫలితాలు విడుదల చేయనున్నారు.

Updated Date - Apr 14 , 2026 | 05:18 AM