కొత్తగా 10వేల పోస్టులు మంజూరు చేయాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:52 AM
రేషనలైజేషన్ ప్రక్రియకు ముందే జీవో 25కు సవరణ చేయాలని ప్రాథమిక విద్య ఉపాధ్యాయ పరిరక్షణ సమితి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఉపాధ్యాయ పరిరక్షణ సమితి జేఏసీ డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రేషనలైజేషన్ ప్రక్రియకు ముందే జీవో 25కు సవరణ చేయాలని ప్రాథమిక విద్య ఉపాధ్యాయ పరిరక్షణ సమితి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 1 నుంచి20 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు ఇద్దరు ఉపాధ్యాయులను, 21 నుంచి 50 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరింది. ప్రాథమిక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలతో కూడిన నూతన జేఏసీ సోమవారం ఏర్పాటైంది. పీటీఏ-టీజీ కార్యాలయంలో మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రద్దు చేయాలని భావిస్తున్న ఎస్జీటీ పోస్టులను ిసీఎస్ హెచ్‌ఎంలుగా మార్చి మొత్తం 10వేల పోస్టులను మంజూరు చేయాలని తీర్మానించారు. మార్చి రెండో వారంలో రౌండ్ టేబుల్ సమావేశం, మూడో వారంలో జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ఏప్రిల్ నెలలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.