30 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో టీ-జేఏసీ ఏర్పాటు
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:54 AM
రాష్ట్రంలోని 30 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ-జేఏసీ) ఏర్పాటయింది. కమిటీ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షుడిగా హర్షవర్ధన్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 30 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ-జేఏసీ) ఏర్పాటయింది. కమిటీ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.చెన్నయ్య అధ్యక్షతన ఈ ఎన్నికలు జరిగాయి. గౌరవ అధ్యక్షుడిగా గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖర్ రావు, సెక్రటరీ జనరల్‌గా శానమోని నరసింహులు, కోశాధికారిగా మురళీధర్ గౌడ్, కో-చైర్మన్లుగా మన్మథరెడ్డి, అబ్బయ్య, ఎం.వీరన్న, సాబీర్, యాకమల్లు, చక్రవర్తుల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా కిశోర్ కుమార్, లక్ష్మణ్, దేవేందర్, నజీరుద్దీన్, భిక్షం, జానీమియా, సత్యనారాయణ, వైస్ చైర్మన్లుగా నర్సింహులు, గాడి లింగస్వామి, మూలతు శ్రీనివాస్, కృష్ణప్రియ, శాంతలక్ష్మి, పవన్‌కుమార్ రెడ్డి, నజీముద్దీన్, దామోదర్, ప్రచార కార్యదర్శిగా అమీర్‌పాషా ఎన్నికయ్యారు. ఏకీకృత సర్వీస్ నిబంధనలు రూపొందించి, ఉపాధ్యాయులకు ప్రతినెలా పదోన్నతులు కల్పించాలని, రెండవ పీఆర్సీని మంచి ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని కమిటీ సమావేశంలో తీర్మానించారు.