Share News

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:25 AM

నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని.. సీపీఎస్‌ వద్దు, ఓపీఎస్‌ ముద్దు అని పలువురు వక్తలు అన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

  • సీపీఎస్‌ను రద్దు చేయాలి

  • మహా విజ్ఞాపన సభలో వక్తల డిమాండ్‌

  • ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

  • ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్‌ రెడ్డి

కవాడిగూడ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని.. సీపీఎస్‌ వద్దు, ఓపీఎస్‌ ముద్దు అని పలువురు వక్తలు అన్నారు. 2004 సెప్టెంబరు 1కి ముందు విడుదలైన నోటిఫికేషన్లలో నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీపీఎస్‌ విధానం నుంచి మినహాయించాలని వారు డిమాండ్‌ చేశారు. శనివారం ఇందిరాపార్కువద్ద ‘2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్‌ పోరాట సమితి’ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో మహా విజ్ఞాపన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబరు ఒకటికి ముందు నోటిఫికేషన్లు విడుదలై నియామక ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎ్‌స)లో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాఽధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీలు మల్కకొమరయ్య, ఏవీఎన్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ ఉపాఽధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకె ళ్తానన్నారు. ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ 2003 ఉద్యోగ ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.


టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ 2003లో నోటిఫికేషన్‌ వచ్చి 2005లో నియామకమైన పదివేల మందికి ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మాడవేడి వినోద్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్‌ మాట్లాడుతూ.. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులకనుగుణంగా 2004 సెప్టెంబరు 1కి ముందు విడుదలైన నోటిఫికేషన్లలలో నియమితులై పాత పెన్షన్‌కు అర్హత కలిగి ఉండి సీపీఎస్‌ పరిధిలోకి వచ్చి అన్యాయానికి గురయ్యారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను పాత పెన్షన్‌ పరిధిలోకి తీసుకువచ్చేలా మహారాష్ట్ర, తమిళనాడు మాదిరిగా కేంద్రం జారీ చేసిన మెమో 57ను అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు, కార్యక్రమంలో పీఆర్టీయూ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, డీటీఎఫ్‌ అధ్యక్షుడు సోమయ్య, టీఆర్‌డీఎఫ్‌ అధ్యక్షుడు కటకం రమేష్‌, టీపీయూఎస్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌, టీపీటీఎఫ్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌, ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 05:26 AM