Share News

రూ.3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:28 AM

ఆర్‌బీఐ మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. 7.54 శాతం వార్షిక వడ్డీ, ఏడేళ్ల...

రూ.3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఆర్‌బీఐ మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. 7.54 శాతం వార్షిక వడ్డీ, ఏడేళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 7.70 శాతం వార్షిక వడ్డీతో 11 ఏళ్లకు రూ.1000 కోట్లు, 7.82 శాతం వార్షిక వడ్డీ, 21 ఏళ్ల పరిమితితో రూ.1000 కోట్ల చొప్పున ఆర్థిక సంస్థల నుంచి ఈ రుణాన్ని సేకరించింది. తెలంగాణతో కలిసి 5 రాష్ట్రాలు రూ.16,900 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి.

Updated Date - Apr 22 , 2026 | 04:28 AM