8న రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:18 AM
తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు...
రీయింబర్స్‌మెంట్ రద్దుకు సర్కారు కుట్రలు: ఆర్.కృష్ణయ్య
బర్కత్‌పుర, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వేయాలన్నారు. కాచిగూడలోని మహారాజ హోటల్‌లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సి. రాజేందర్, ప్రధాన కార్యదర్శి టి.రాజేష్ యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం 18 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు తీర్పువల్ల 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.