Share News

తెలంగాణ విద్యార్థులకు ‘కోగ్నిచాంప్‌’ స్కాలర్‌షిప్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:30 AM

విద్యార్థుల ప్రతిభను కేవలం మార్కులతో కాకుండా మేధస్సు ఆధారంగా గుర్తించే కొత్తతరహా స్కాలర్‌షిప్‌ పథకాన్ని హైదరాబాద్‌....

తెలంగాణ విద్యార్థులకు ‘కోగ్నిచాంప్‌’ స్కాలర్‌షిప్‌

  • దరఖాస్తుకు ఏప్రిల్‌ 26 ఆఖరు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ప్రతిభను కేవలం మార్కులతో కాకుండా మేధస్సు ఆధారంగా గుర్తించే కొత్తతరహా స్కాలర్‌షిప్‌ పథకాన్ని హైదరాబాద్‌ ఏఐ స్టార్టప్‌ కంపెనీ కోగ్నిటివ్‌ స్కోర్‌ డాట్‌ ఏఐ ప్రారంభించింది. తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 3-18 ఏళ్ల లోపు విద్యార్థులందరూ ఈ స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హులు. ఇందుకోసం ఆన్‌లైన్‌ పరీక్ష రాయాల్సి ఉంటుందని, ఈనెల 26 వరకు ‘కోగ్నిటివ్‌ స్కోర్‌ డాట్‌ ఏఐ’ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 05:30 AM