సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - May 30 , 2026 | 04:04 AM
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ(సర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
త్వరలో షెడ్యూల్: సీఈఓ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ(సర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం త్వరలోనే సర్ ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటించనుందని తెలిపారు. సీఈఓ కార్యాలయంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులు(డీఈఓ), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్‌ఓ), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఏఈఆర్‌ఓ), బీఎల్‌ఓ సూపర్ వైజర్లు, ఇతర ఎన్నికల అధికారులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు.