కడియం అనర్హత పిటిషిన్‌ను విచారించిన స్పీకర్
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:58 AM
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వేసిన అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం విచారణ జరిపారు. బీఆర్‌ఎస్ అసెంబ్లీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద...
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వేసిన అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం విచారణ జరిపారు. బీఆర్‌ఎస్ అసెంబ్లీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద , ఆయన తరఫు న్యాయవాది విచారణకు హాజరై.. రుజువులను సమర్పించారు. అలాగే కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వివిధ సందర్భాల్లో కడియం దిగిన ఫొటోలను సాక్ష్యాలుగా చూపుతూ.. ఆయన పార్టీ మారినట్లుగా గుర్తించాలని వారు కోరారు. కాగా.. ఈ సమాచారం ఆధారంగా త్వరలోనే కడియం, ఆయన తరఫు న్యాయవాదిని స్పీకర్ విచారణ జరపనున్నారు. అనంతరం కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ కాళ్లు పట్టుకుని కడియం ఎంపీ అయ్యారని అన్నారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారని, 2023లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాంగ్రె్‌సలో చేరి కూతురుకి ఎంపీ టికెట్ ఇప్పించి ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారన్నారు. కారు గుర్తుతో గెలిచిన ఆయనకు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.