Share News

తెలంగాణ నైపుణ్యాభివృద్ధికి జాతీయస్థాయి గుర్తింపు

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:44 AM

తెలంగాణ రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ శాఖకు(డీఈటీ) జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నైపుణ్య శిక్షణ కోసం డీఈటీ అందించే ...

తెలంగాణ నైపుణ్యాభివృద్ధికి జాతీయస్థాయి గుర్తింపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ శాఖకు(డీఈటీ) జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నైపుణ్య శిక్షణ కోసం డీఈటీ అందించే కోర్సులకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీవీఈటీ) రాష్ట్రానికి అవార్డింగ్‌ బాడీ గుర్తింపు అందించింది. దీంతో డీఈటీ ఇప్పుడు రాష్ట్రంలో శిక్షణ ఇవ్వడంతోపాటు స్వయంగా పరీక్షలు నిర్వహించి, జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన సర్టిఫికేట్లను జారీచేసేందుకు అనుమతి పొందింది. దీనికి సంబంధించి ఢిల్లీలో ఎన్‌సీవీఈటీ ఛైర్‌పర్సన్‌ దేబశ్రీ ముఖర్జీ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో డీఈటీ డైరెక్టర్‌ కాంతి వెస్లి, జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌వికే.నగేష్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.రాజా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు జాతీయస్థాయి గుర్తింపు లభించిందని కార్మిక, ఉపాధి, శిక్షణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్‌ చెప్పారు.

Updated Date - Apr 26 , 2026 | 04:44 AM