వృద్ధులు, దివ్యాంగులకు సర్ విచారణ నుంచి మినహాయింపు
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:43 AM
సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వయోవృద్దులు (సీనియర్ సిటిజన్లు) దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓటర్లకు విచారణ నుంచి ఊరట కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల..
వారి తరఫున కుటుంబంలోని వయోజన సభ్యుడు హాజరు కావొచ్చు: సీఈఓ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వయోవృద్దులు (సీనియర్ సిటిజన్లు) దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓటర్లకు విచారణ నుంచి ఊరట కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. ఆ మూడు క్యాటగిరీల వారితోపాటు విదేశాల్లో నివసిస్తున్న ఓటర్లు స్వయంగా విచారణకు హాజరుకాలేని పరిస్థితుల్లో వారి తరఫున కుటుంబంలోని వయోజన సభ్యుడు ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ ఎదుట హాజరయ్యేందుకు అవకాశం ఉందని తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో నివసిస్తున్న ఓటర్లు వ్యక్తిగతంగా ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ కార్యాలయాలకు వచ్చి విచారణకు హాజరు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ పేర్కొన్నారు.