Share News

‘సర్‌’ ఫారాలను సకాలంలో సమర్పించండి

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:17 AM

సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్‌ ఫారాలను సమగ్ర వివరాలతో సకాలంలో బీఎల్‌ఓలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు.

‘సర్‌’ ఫారాలను సకాలంలో సమర్పించండి

  • లేదంటే ఓటుహక్కు కోల్పోతారు

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

వనస్థలిపురం, జూలై 12(ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్‌ ఫారాలను సమగ్ర వివరాలతో సకాలంలో బీఎల్‌ఓలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో ‘సర్‌’ ప్రకియ్రను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి నారాయణరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్‌ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ‘సర్‌’ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అర్హత గల ప్రతి వ్యక్తికి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందేలా చూడటంతో పాటు సమగ్ర వివరాలతో నిర్దేశిత గడువులోగా తిరిగి స్వీకరించాలన్నారు. బీఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి వివరాలను గడువులోగా డిజిటైజేషన్‌ చేయాలని సూచించారు. ఫారాలు అందించని వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Jul 13 , 2026 | 05:18 AM