Share News

కేంద్రం నుంచి రూ.423 కోట్ల ఆర్థిక సాయం

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:48 AM

డిజిటల్‌ వ్యవసాయంలో భాగంగా రైతుల నమోదు ప్రక్రియలో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ..

కేంద్రం నుంచి రూ.423 కోట్ల ఆర్థిక సాయం

  • రైతుల నమోదులో తెలంగాణ అరుదైన రికార్డు: తుమ్మల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘డిజిటల్‌ వ్యవసాయంలో భాగంగా రైతుల నమోదు ప్రక్రియలో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేసి అరుదైన రికార్డు సాధించాం. రాష్ట్ర వ్యవసాయశాఖ పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేసిన కేంద్ర ప్రభుత్వం రూ. 423 కోట్ల ఆర్థిక ప్రోత్సాహం మంజూరు చేసింది’’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం పట్టాదారులు 73.82 లక్షల మంది ఉంటే.. కేంద్ర ప్రభుత్వం 39,77,791 మంది రైతులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని టార్గెట్‌ విధించినట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో 43,59,371 మంది రైతులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 110 శాతం ప్రగతి సాధించినందుకుగాను కేంద్రం నుంచి ప్రశంసలు వచ్చినట్లు వెల్లడించారు. అదేక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కేంద్ర సహాయం (ఎస్‌సీఏ) కింద రూ. 422.64 కోట్లు మంజూరు చేసినట్లు తుమ్మల తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 03:48 AM