వయోవృద్ధుల రక్షణకు సహకరించండి
ABN , Publish Date - May 07 , 2026 | 05:50 AM
వర్తమాన కాల పరిస్థితుల్లో వయో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నివసిస్తున్న వయోవృద్ధుల రక్షణకు పటిష్ఠ వ్యూహాన్ని అమలు చేయాలని కోరుతూ డీజీపీ సీవీ ఆనంద్‌కు తెలంగాణ వయోవృద్ధుల...
పోలీసుస్టేషన్ స్థాయిలో రిజిస్టర్ ప్రారంభించండి
డీజీపీకి వయోవృద్ధుల సమాఖ్య వినతి
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి) : వర్తమాన కాల పరిస్థితుల్లో వయో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నివసిస్తున్న వయోవృద్ధుల రక్షణకు పటిష్ఠ వ్యూహాన్ని అమలు చేయాలని కోరుతూ డీజీపీ సీవీ ఆనంద్‌కు తెలంగాణ వయోవృద్ధుల సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. తల్లిదండ్రులు, వయోవృద్ధుల భరణం, సంక్షేమ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం వీరు సవాళ్లను ఎదుర్కొంటున్నపుడు వారి ప్రాణాలను, ఆస్తులను కాపాడటం చట్టపరమైన బాధ్యతగా ఉందని, దీన్ని అమలు చేయాలంటే సమగ్ర ప్రణాళిక అవసరమని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఈ చట్టం ప్రకారం పోలీసులు తమ ప్రాంతంలోని వయోవృద్ధుల రిజిస్టర్ నిర్వహించాలని, వారి ఇళ్లను తరచూ సందర్శిస్తుండాలని, వారి ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా తగు ఆదేశాలు జారీ చేయాలని సమాఖ్య ప్రతినిధులు డీజీపీని కోరారు. తెలంగాణ వయోవృద్ధుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మయ్య, సుభాకర్ రావు, జ్ఞానేశ్వర్, కృష్ణప్రసాద్ తదితరులు డీజీపీని కలిసిన ప్రతినిధి బృందంలో ఉన్నారు.