Share News

Growth in Registration Revenue: రిజిస్ట్రేషన్ల ఆదాయం 6.6శాతం వృద్ధి

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:31 AM

రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం 6.6 శాతానికి పైగా పెరిగింది. 2024 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య ఆదాయం రూ.10,600 కోట్లయితే..

Growth in Registration Revenue: రిజిస్ట్రేషన్ల ఆదాయం 6.6శాతం వృద్ధి

  • 2025-26 ఏప్రిల్‌-డిసెంబరు రాబడి రూ.11,300 కోట్లు

  • 2024-25 ఏప్రిల్‌-డిసెంబరులో రూ.10,600 కోట్లు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం 6.6 శాతానికి పైగా పెరిగింది. 2024 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య ఆదాయం రూ.10,600 కోట్లయితే.. 2025-ఏప్రిల్‌-డిసెంబరు మధ్య రూ.11,300 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా లభించింది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన డాక్యుమెంట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. 2024 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 13.10 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 12.60 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ కావడం గమనార్హం. 2024-25తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 వేల డాక్యుమెంట్లు తగ్గినా రాబడి పైపైకి దూసుకెళ్తుండటంతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తుండటంతో కొత్త సంవత్సరం (2026)లో ఆదాయ రూపేణా రిజిస్ట్రేషన్లశాఖ దూసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - Jan 02 , 2026 | 04:31 AM