Share News

ఎస్సీ గురుకులాల నిర్వహణకు 184 కోట్లు

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:36 AM

పేద దళిత, గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ...

ఎస్సీ గురుకులాల నిర్వహణకు 184 కోట్లు

  • 625 మంది సిబ్బంది నియామకానికి ఓకే

  • తమిళనాడు తరహాలో స్టడీ సర్కిళ్లు

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి అడ్లూరి విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పేద దళిత, గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలోని గురుకులాల నిర్వహణకు రూ.184.17 కోట్లు విడుదల చేసింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, శుభ్రమైన వసతి, భవనాల అద్దెలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అవసరాలకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. అలాగే, గురుకులాల్లో బోధనేతర సిబ్బంది కొరత నివారణకు.. వార్డెన్లు, వంట మనుషులు (కుక్‌), పారిశుద్ధ్యం, భద్రతా అవసరాల కోసం 625 మంది నియామకానికి సర్కారు అనుమతినిచ్చింది. ఔట్‌ సోర్సింగ్‌, గౌరవ వేతనం పద్ధతిలో వేతనాలు చెల్లిస్తారు. ఇక తమిళనాడు తరహాలో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో అత్యాధునిక స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ కేంద్రాన్ని స్టడీ సర్కిల్‌గా మార్చడంతోపాటు ఢిల్లీ టీచింగ్‌ ఫ్యాకల్టీలతో సివిల్స్‌ కోచింగ్‌ ఇప్పించాలని కోరానన్నారు. 80ు పూర్తయిన హాస్టల్‌ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని భట్టి విక్రమార్కను కోరినట్లు ఆయన చెప్పారు. బాలికల డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలు, భద్రతపై శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 04:36 AM