బడుల ప్రారంభం రోజే..డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ, కిట్ల పంపిణీ
ABN , Publish Date - May 12 , 2026 | 04:25 AM
జూన్ 12వ తేదీన పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా పొగాకు, మద్యం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
గవర్నర్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జూన్ 12వ తేదీన పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా పొగాకు, మద్యం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అదే రోజు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం ఆహ్వానించారు. ఈ మేరకు లోక్ భవన్‌లో సోమవారం గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఇచ్చే కిట్లలో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, స్కూల్ బ్యాగ్, క్రీడా దుస్తులు, విద్యార్థులకు అవసరమైన ఇతర సామగ్రి ఉంటాయని సీఎం తెలియజేశారు. విద్యాసంస్థలను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే సామూహిక ప్రతిజ్ఞ లక్ష్యమని వివరించారు.