Share News

నేడు విద్యాసంస్థల బంద్‌

ABN , Publish Date - Jul 24 , 2026 | 06:32 AM

నీట్‌ పేపర్‌ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా..

నేడు విద్యాసంస్థల బంద్‌

  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో బంద్‌కు పిలుపు ఇచ్చిన పలు విద్యార్థి సంఘాలు

  • సెలవు ప్రకటించిన ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు

  • జేఎన్‌టీయూ, ఓయూ, కాళోజీ యూనివర్సిటీల పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

నీట్‌ పేపర్‌ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లోని పాఠశాలలు శుక్రవారం సెలవు ప్రకటించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 3,500 ప్రైవేటు పాఠశాలలు ఉండగా సగానికి పైగా సెలవు ప్రకటించాయని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ కాలేజీలు సైతం సెలవు ప్రకటించాయి. బంద్‌ పిలుపు నేపథ్యంలో జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాళోజీ వర్సిటీలఆధ్వర్యంలో శుక్రవారం జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో ప్రకటిస్తామని ఆయా వర్సిటీలు తెలిపాయి. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

Updated Date - Jul 24 , 2026 | 06:34 AM