రాష్ట్రంలో ఇసుక కొరత లేదు: టీజీఎండీసీ
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:52 AM
రాష్ట్రంలో ఇసుక కొరత లేదని, శ్యాండ్ బజార్లు, స్టాక్ యార్డుల నుంచి ఆన్‌లైన్‌లో పూర్తి పారదర్శకంగా విక్రయాలు సాగిస్తున్నామని ...
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక కొరత లేదని, శ్యాండ్ బజార్లు, స్టాక్ యార్డుల నుంచి ఆన్‌లైన్‌లో పూర్తి పారదర్శకంగా విక్రయాలు సాగిస్తున్నామని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఎండీ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. టీజీఎండీసీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఇసుక కాంట్రాక్టర్ల బకాయిలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసిందని వివరించారు. ఇదివరకు మధ్యాహ్నం 12 గంటలు, 3 గంటలు, సాయంత్రం 5గంటలకు మాత్రమే ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ వేళలు ఉండేవని, ఇప్పుడు 24 గంటల పాటు బుకింగ్ సదుపాయం కల్పించామని వెల్లడించారు. ఒకేరోజు ఎక్కువ మంది బుక్ చేసుకున్నట్లయితే... ఇసుక అమ్మకాల నిర్వహణ, పర్యవేక్షణ విధానం (ఎస్‌ఎ్‌సఎంఎంఎస్) ద్వారా ర్యాండమైజేషన్ (యాదృచ్ఛికంగా ఎంపిక చేయడం) పద్ధతిలో ఇసుకను కేటాయిస్తామని తెలిపారు.