మహానగరంలో 3,145 కోట్లతో రోడ్లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:30 AM
హైదరాబాద్ మహానగరంలో రహదారుల అభివృద్ధి, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,145 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది.
సీఆర్‌ఎంపీ రెండో దశకు ప్రభుత్వ అనుమతి
మూడు కార్పొరేషన్లకు నిధుల మంజూరు
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగరంలో రహదారుల అభివృద్ధి, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,145 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ-2) రెండోదశ కింద ఈ పనులు చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మెట్రోపాలిటిన్ ఏరియా అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ శాఖ జీవో 591 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. 1,045.01 కి.మీ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ మొత్తం నిధులను మూడు కార్పొరేషన్ల మధ్య విభజించారు. జీహెచ్‌ఎంసీకి రూ.1533 కోట్లు, మల్కాజిగిరి కార్పొరేషన్‌కు రూ.818 కోట్లు, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు రూ.794 కోట్ల చొప్పున కేటాయింపులు చేశారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 67.36 కి.మీ, మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో 69.90 కి.మీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో 32.13 కి.మీ మేర పనులు చేపట్టనున్నారు.