తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడిగా సుదర్శన్
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:50 AM
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా తీగల సాగర్ ఎన్నికయ్యారు. కొత్తగూడెంలో మూడురోజులుగా..
ప్రధాన కార్యదర్శిగా తీగల సాగర్..
కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా తీగల సాగర్ ఎన్నికయ్యారు. కొత్తగూడెంలో మూడురోజులుగా జరుగుతు న్న రైతుసంఘం రాష్ట్ర మహాసభలు శనివారం ముగిశాయి. ఈ మహాసభల చివరి రోజున 93 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడంతో పాటు 30 అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్, సాగర్ మీడియాతో మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.