Share News

కేబినెట్‌లో వేతన సవరణ ప్రకటించాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:42 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న జరగనున్న కేబినెట్‌ సమావేశంలో వేతన సవరణ ప్రకటించాలని ఆర్టీసీ కార్మికులు కోరారు.

కేబినెట్‌లో వేతన సవరణ ప్రకటించాలి

  • ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న జరగనున్న కేబినెట్‌ సమావేశంలో వేతన సవరణ ప్రకటించాలని ఆర్టీసీ కార్మికులు కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు పూర్తిస్థాయి మద్దతు పలికారని, ఇప్పుడు ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను వెంటనే అమలు చేయాలని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 30ు ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ నాగేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 19 , 2026 | 04:42 AM