బస్టాపుల ప్రాంగణాల్లో ల్యాండ్‌స్కేపింగ్..!
ABN , Publish Date - May 19 , 2026 | 05:11 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. బస్టాపులను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు..
అందమైన మొక్కల పెంపకానికి ఆర్టీసీ ప్లాన్
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. బస్టాపులను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ‘ల్యాండ్‌స్కేపింగ్’ (పచ్చదనం-అందమైన మొక్కల పెంపకం) చేపట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. బస్టాపుల ప్రాంగణాల్లో రంగు రంగుల పూల మొక్కలు, అలంకరణ శైలి మొక్కలను నాటడం ద్వారా ప్రయాణికులకు ఆహ్లాదకరమై వాతావరణం కల్పించనున్నారు. ఇది కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడుతుంది. ముందుగా ఎంపిక చేసిన బస్టాపుల ప్రవేశ మార్గాల వద్ద ప్రత్యేక లైటింగ్, ఆకర్షణీయమైన మొక్కలతో కూడిన ‘ఐ లవ్ ఆర్టీసీ’ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు బస్టాపులను సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా ప్రజలను ప్రభుత్వ రవాణా వ్యవస్థ వైపు మరింతగా ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు.