Share News

Telangana Rising: కొత్త ఏడాదిలో తెలంగాణ రైజింగ్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:51 AM

2026లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

Telangana Rising: కొత్త ఏడాదిలో తెలంగాణ రైజింగ్‌

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్ష

  • ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): 2026లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ -2047 లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. కాగా, బేగంపేటలోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

జానారెడ్డికి సీఎం రేవంత్‌ పరామర్శ

కాంగ్రెస్‌ నేత జానారెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న జానారెడ్డి.. హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.

Updated Date - Jan 01 , 2026 | 07:51 AM