Share News

మరో 8 లక్షల టన్నుల బియ్యం సేకరణ

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:04 AM

తెలంగాణలో రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్రం నుంచి అదనంగా మరో 8లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంసేకరణకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మరో 8 లక్షల టన్నుల బియ్యం సేకరణ

  • కేంద్రం అంగీకారం

  • రాష్ట్రంలో 43లక్షల టన్నులకు పెరిగిన సేకరణ లక్ష్యం

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్రం నుంచి అదనంగా మరో 8లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంసేకరణకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం సేకరణ లక్ష్యం 43లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర రైతుల మేలు కోసం, బీజేపీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇదే అంశంపై మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌ బుధవారం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కేంద్రం నిర్ణయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 23 , 2026 | 06:05 AM