Share News

తెలంగాణ గ్రామీణ సంస్కృతికి పునర్జీవం... బయలాట కళకు కొత్త ఊపిరి

ABN , Publish Date - Jun 28 , 2026 | 01:00 AM

కాలం మారుతోంది... తరాలు మారుతున్నాయి... వినోద రూపాలు మారుతున్నాయి... కానీ... మన పల్లెల గుండెల్లో పుట్టి... ప్రజల జీవితాలతో మమేకమై... తరతరాలుగా సాంస్కృతిక వారసత్వాన్ని మోస్తూ వస్తున్న బయలాట నాటక కళారూపం మాత్రం ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది.

తెలంగాణ గ్రామీణ సంస్కృతికి పునర్జీవం... బయలాట కళకు కొత్త ఊపిరి

నారాయణపేట: కాలం మారుతోంది... తరాలు మారుతున్నాయి... వినోద రూపాలు మారుతున్నాయి... కానీ... మన పల్లెల గుండెల్లో పుట్టి... ప్రజల జీవితాలతో మమేకమై... తరతరాలుగా సాంస్కృతిక వారసత్వాన్ని మోస్తూ వస్తున్న బయలాట నాటక కళారూపం మాత్రం ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది.

అలాంటి గొప్ప జానపద కళను మరింత బలోపేతం చేయడానికి... భవిష్యత్ తరాలకు అందించడానికి... కళాకారులకు శిక్షణ ఇచ్చి కొత్త అవకాశాలు కల్పించడానికి... బిజిఏ థియేటర్ అసోసియేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో... 60 రోజుల బయలాట డ్రామా ట్రైనింగ్ వర్క్ షాప్ నారాయణపేట జిల్లా, మద్దూరు మండలం, అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది.

ఆగస్టు 25వ తేదీ వరకు కొనసాగనున్న ఈ శిక్షణ శిబిరంలో... బయలాట నాటక కళకు సంబంధించిన అభినయం, సంభాషణ, గాత్ర నైపుణ్యం, రంగస్థల నిర్వహణ, పాత్రల రూపకల్పన, జానపద ప్రదర్శన శైలులు వంటి అనేక అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

ఈ సందర్భంగా బిజిఏ థియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్ కాడం మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న బయలాట నాటక కళను సంరక్షించడం మాత్రమే కాకుండా... దానిని కొత్త తరాలకు చేరవేసి... కళాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ వర్క్ షాప్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Updated Date - Jun 28 , 2026 | 01:05 AM